MABD

MABD

Friday 6 October 2017

Thursday 5 October 2017

APPLICATION FORM

SSA NOTIFICATION 2017


తేది: 05.10.2017,

మహబూబాబాద్.

పత్రికా ప్రకటన

మహబూబాబాద్ జిల్లాలో సర్వశిక్షా అభియాన్ పథకం క్రింద, ఈ క్రింద పేర్కొనబడిన ఉద్యోగములు కాంట్రాక్ట్ పద్దతిపై భర్తీ చేయుటకు జిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. జిల్లాలో స్థానికత ద్రువీకరనకై 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు అభ్యసించిన దృవీకరణ పత్రములు దరఖాస్తుతో జతపరచవలయును. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయువారు లోకల్ ట్రైబ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా జతపరచవలయును.

1)

అసిస్టెంట్ ప్రోగ్రామర్ (APO) : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములో

 

విద్యార్హతలు: MCA/ B.Tech (కంప్యుటర్ సైన్స్) తో పాటుగా ఓరాకిల్ నాలెడ్జ్ ఉండాలి

2)

సిస్టం అనలిస్ట్ : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములో

 

విద్యార్హతలు: B.Com/ M.Com తో పాటుగా Tally Accounting Package ఉండాలి

3)

డాట ఎంట్రి ఆపరేటర్ : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములో

 

విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ మరియు DCA, M.S. Office ఉండాలి

4)

ఇంక్లుసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ (IERP) : IERC గూడూరు (ఏజెన్సీ)

 

విద్యార్హతలు: ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండవలేయును మరియు స్పెషల్ M.Ed./ స్పెషల్ B.Ed./ స్పెషల్ D.Ed./ స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉత్తీర్ణత అయి ఉండవలేయును.

రోస్టర్ పాయింట్ : 1. ST-W

5)

కాంట్రాక్ట్ రెసిడేన్షియల్ టీచర్ - హిందీ (CRT) : KGBV గంగారం (ఏజేన్సి)

 

విద్యార్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ, మెయిన్ సబ్జెక్ట్ హిందీ కలిగిన డిగ్రీ లేక హిందీ ఓరియంటల్ లాంగ్వేజ్ డిగ్రీ లేక హిందీలో PGతో పాటుగా హిందీ మెతడాలజి కలిగిన B.Ed లేక హిందీ పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి మరియు TET సెకండ్ పేపర్ ఉత్తీర్ణత అయి ఉండవలేయును.

రోస్టర్ పాయింట్ : 1.ST-W

6)

PET : KGBV కొత్తగూడలో (ఏజేన్సి)

 

విద్యార్హతలు : ఇంటర్మీడియట్ తో పాటుగా D.P.Ed ఉండాలి లేక డిగ్రీ తో పాటుగా B.P.Ed.

రోస్టర్ పాయింట్ : 1.ST-W

వయస్సు: అభ్యర్థులు 18 సం||ల నుండి 44 సం||ల వరకు అర్హులు. ది:01.07.2017 తేది ప్రకారము వయస్సు నిర్ణయించబడును (SC/ST/BC కులములకు చెందిన అభ్యర్థులకు 5 సం||లు వయోపరమితి సడలింపు ఇవ్వనైనది మరియు 10 సం||లు దివ్యాంగులకు వయోపరమితి సడలింపు ఇవ్వనైనది.

ఆసక్తి గల అభ్యర్థులు పైన పేర్కొనబడిన విద్యార్హతల ధ్రువపత్రముల జీరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్ వారిచే ధ్రువీకరించి జిల్లా విద్యాశాఖాధికారి మహబూబాబాద్ వారి కార్యాలయములో సమర్పించవలయును మరియు బయోడేటా ఫారములు జిల్లా విద్యాశాఖాధికారి మహబూబాబాద్ వారి కార్యాలయములో లభ్యమగును మరియు www.deomahbad.blogspot.com వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

దరఖాస్తులు స్వీకరించుటకు ఆఖరు తేది: 10.10.2017 సాయంత్రం 5.00 గం|| వరకు పనిదినములలో మాత్రమే మరియు ఇతర వివరములకు www.deomahbad.blogspot.com ను సందర్శించవలయును.